జయప్రద ఫౌండేషన్ వారు నూతక్కి లోని విజ్ఞాన్ విహార స్కూల్ లో 350 మంది విద్యార్థినులకు మెన్స్ట్రువల్ హైజీన్ మీద అవగాహన కల్పించి, ఋతు సమస్యలు ఉన్న విద్యార్థినులను సీనియర్ గైనకాలజిస్ట్ రమాదేవి గారిచే పరీక్షింపజేసి, వారికి అవసరమైన మందులు ఇవ్వటం జరిగింది. దీనితోపాటు సానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేసి అందరు విద్యార్థినులకు కెరీర్ పై అవగాహన కల్పిస్తు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. అదనంగా, దంత సమస్యలు ఉన్న వారికి, ప్రముఖ డెంటల్ డాక్టర్ వరుణ్ గారితో పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇవ్వటం జరిగింది.
ఈ అవకాశం మాకు కల్పించి, అన్నివిధాలుగా సహకరించిన విద్యా భారతి స్టేట్ వైస్-ప్రెసిడెంట్ శ్రీ వెలగపూడి రామకృష్ణ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు సహాయ సహకారాలు అందించిన విజ్ఞాన్ విహార స్కూల్ ప్రిన్సిపాల్ వెనిగాళ్ళ సురేష్ గారికి మా కృతజ్ఞతలు.