Facebook

Cover for Jayaprada Foundation
435
Jayaprada Foundation

Jayaprada Foundation

Jayaprada Foundation is a charitable not-for-profit organisation that was formed to help the economically deprived by supporting them in areas such as education, employment, health, social welfare and public benefit.

2 weeks ago

Jayaprada Foundation
జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాల్లో భాగంగా మెడికల్ కాంపులను మరింత విస్తరించడం కోసం రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి మరియు శంకర్ నేత్ర చికిత్సాలయ వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ టి డి జనార్దన్ గారు, రోటరీ గవర్నర్ ఎం వెంకటేశ్వర రావు గారు మరియు అసిస్టెంట్ గవర్నర్ Dr శ్రీ హర్ష గారు, క్లబ్ ప్రెసిడెంట్ Dr ప్రఫుల్ గారు క్లబ్ సెక్రటరీ వినయ్ గారు, శంకర్ నేత్ర చికిత్సాలయ Dr రోహిత్ గారు, బోడేపూడి అమర్ గారు, జయప్రద ఫౌండేషన్ నుంచి చెరుకూరి చాముండేశ్వరి గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఒప్పందం లక్షల మంది పేదలకు వైద్య సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాము... ... See MoreSee Less
View on Facebook

3 weeks ago

Jayaprada Foundation
స్వచ్ఛమైన నీరు – ఆరోగ్యకరమైన భవిష్యత్తు!పరిశుద్ధమైన నీటిని అందరికీ అందుబాటులోకి తేవాలి అన్న సంకల్పంతో సురక్షితమైన తాగునీరు అందించేందుకు, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలకు, జయప్రద ఫౌండేషన్ రాజు వేగేశ్న ఫౌండేషన్ వారి సహకారంతో రెండు RO వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో భాగంగా నీటి కాలుష్యం వలన కలిగే సమస్యలను దాని వలన వచ్చే ప్రమాదాన్ని పిల్లలకి వివరించాము. నీటిని శుద్ధి చేసి తాగటానికి ఉపయోగపడేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మరియు సూత్రాలు పాటిస్తూ ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేశాము. గత నెలలో జరిగిన ఎనీమియా శిబిరం విజయవంతంగా పూర్తైనందున కళాశాల యాజమాన్యం విద్యార్థినులు సమక్షంలో ఒక సభను ఏర్పాటు చేసి ఫౌండేషన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎనీమియా శిబిరంలో పరీక్షించబడిన కొందరు విద్యార్థినులకు హిమోగ్లోబిన్ 4 g/dL ఉండటంతో వారందరికీ అవసరమైన వైద్య చికిత్సను ఇచ్చి వారికి ఫాలోఅప్ చికిత్స కూడా అందించాము. దీని వల్ల విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెరిగింది మరియు కాలేజీ యాజమాన్యం వారి సంతోషాన్ని వ్యక్తం చేసింది.అంతేకాకుండా, జయప్రద ఫౌండేషన్ కంటి పరీక్షల శిబిరం కూడా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు లేదా అవసరమైన కంటి చికిత్స కోసం మందులు అందించబడ్డాయి.అలాగే, మా ఫౌండేషన్ కార్యకలాపాల్లో భాగంగా సేవలందించిన ఎన్.ఎస్.ఎస్ విద్యార్థినులకు వాలంటీర్ సర్టిఫికేట్లను అందజేశాము. మీ సమర్పణా భావం, కృషి, సమాజ సేవకు చేసిన సహాయం ప్రశంసనీయం. మీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు!శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యానికి మరియు ప్రిన్సిపల్ కల్పన గారికి వారి సహకారానికి మరియు ప్రోత్సాహానికి మా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు!#jayapradafoundation #SafeDrinkingWater #watertreatmentplant #accesstosafedrinkingwater #WaterSafety #cleandrinkingwater #FreeEyeCheckup #VisionForAll #eyehealth #HealthyVision #eyecare #anemiaawareness #fightanemia #irondeficiency #healthyblood #stopanemia #stayhealthy #ironrichfoods #BloodHealth #AnemiaPrevention #healthfirst #StrongerYou #nutritionmatters #BoostYourIron #WellnessJourney #healthyliving ... See MoreSee Less
View on Facebook

3 weeks ago

Jayaprada Foundation
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జయప్రద ఫౌండేషన్ విజయవాడలో నిర్వహించిన “మహిళా శక్తి సమ్మేళనం” కార్యక్రమానికి విచ్చేసిన అక్కినేని హాస్పిటల్స్ డాక్టర్ అక్కినేని మణి గారు, వైద్య వృత్తిలో ఎన్నో ఉన్నత శిఖరాలు అదిరోహించిన ఎంతో అనుభవం ఉన్న వైద్యురాలు. ఈ కార్యక్రమములో ప్రసంగిస్తూ, ఆవిడ పలు సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి చాల విలువైన సూచనలను అందిచారు: •గత కొన్ని సంవత్సరాల్లో మహిళల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయి. కొన్ని రంగాల్లో ఆశించిన అభివృద్ధి జరగలేదు లేదని పేర్కొన్నారు.•భారతదేశంలో చాలా మంది మహిళలు ఆసుపత్రికి వెళ్లగలిగే స్థితిలో ఆర్థికంగా ఉన్నప్పటికీ, క్యాన్సర్ మూడో దశ లేదా నాలుగో దశ వచ్చే వరకు హాస్పిటల్ కి వచ్చి చికిత్స చేపించుకోరు. అవగాహన లోపం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. •ఎనీమియా (రక్తహీనత) – భారతదేశంలో మహిళలలో ఎక్కువగా కనిపించే సమస్య. ఐరన్ లోపం, పోషకాహార లోపం కారణంగా ఇది ఏర్పడుతుంది. సాధారణంగా హిమోగ్లోబిన్ 12.3 to 15.3 g/dL ఉండాలి. కానీ 3 g/dL ఉన్న ఆడ పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పారు. ఎనీమియా మీద అవగాహన కలిగించాలి అని అన్నారు. •గర్భధారణ మరియు ప్రసవ సమస్యలు – ఎనీమియా వల్ల మరియు తగినంత వైద్య సహాయం లేకపోవడం వల్ల ప్రసవ సమయంలో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.•(PCOS/PCOD) – హార్మోన్ల అసమతుల్యత వల్ల మెన్‌స్ట్రువల్ సైకిల్ లేటవడం, ఊబకాయం, గర్భధారణ సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. ఆహార అవగాహన మరియు శారీరక అవగాహన కల్పించాలి అని అన్నారు. •బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్ – సకాలంలో స్క్రీనింగ్ చేసుకోకపోవడం భారతదేశంలో మహిళలను ప్రభావితం చేసే ప్రధాన సమస్యలలో ఒకటి అన్నారు. •మెనోపాజ్ సంబంధిత సమస్యలు – ఆస్టియోపోరోసిస్, హార్మోన్ మార్పులు, మానసిక ఒత్తిడి మొదలైనవి కూడా ఉంటాయన్నారు. ఈ సమస్యల అన్నింటి గురించి, నెలసరి హార్మోన్ల గురించి, అవగాహన అనేది, ప్యూబర్టీకి ముందే కల్పించడం అమ్మాయిల శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పారు. ఇది వారి శరీరంలో జరిగే మార్పులను అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఐరన్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్‌లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం అని చెప్పారు.ఆవిడ సూచనలతో ప్రతిబించెట్టుగ, గతంలో జయప్రద ఫౌండేషన్ కూడా గోదావరి, కృష్ణ మరియు గుంటూరు జిల్లాలలో పలు ప్రాంతాల్లోని కలశాలలో రక్త హీనతకు సంబంధించిన పరీక్షలు నిర్వహించటం, అవగాహన కల్పించటం, వైద్యుల సూచన మేరకు వారికి మందులు అందించటం, కొంత కాలం తరవాత వారికి చికిత్సను కొనసాగించి ఎనీమియా ను నివారించాలని ప్రయత్నించింది.‘ఒక ఆరోగ్యకరమైన మహిళ తన కుటుంబాన్ని, సమాజాన్ని, తద్వారా రాబోయే తరాలను ఆరోగ్యంగా తీర్చిదిద్దుతుంది’, అనే భావన తో జయప్రద ఫౌండేషన్ స్త్రీలు; తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సరైన పోషకాహారం తీసుకుని, ప్రతి రోజు వ్యాయామం చేస్తూ, వైద్య పరీక్షలు చేయించుకుని, ఆరోగ్య సమస్యలు తగ్గించుకుని మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకోవచ్చని నమ్మి తమ క్యాంపుల్లో మహిళలకు అవగాహన కల్పించి వారికి భరోసా కల్పిస్తోంది. మీ మాటలు ఆలోచింపజేసేలా, మార్గదర్శకంగా, మరియు ప్రేరణనిచ్చేలా ఉన్నాయి .. డాక్టర్ అక్కినేని మణి గారు మీకు మా ధన్యవాదాలు!- జయప్రద ఫౌండేషన్ ... See MoreSee Less
View on Facebook

3 weeks ago

Jayaprada Foundation
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జయప్రద ఫౌండేషన్ విజయవాడలో “మహిళా శక్తి సమ్మేళనం” కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ ఆదిత్య జీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత్ ప్రచారక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, మీ విలువైన సందేశంతో మాకు స్ఫూర్తినిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మద్దతు మరియు ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము.ధన్యవాదాలు!#JayapradaFoundation #InternationalWomensDay #WomensDay2025 #IWD2025 #CelebrateWomen ... See MoreSee Less
View on Facebook

3 weeks ago

Jayaprada Foundation
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జయప్రద ఫౌండేషన్ విజయవాడలో “మహిళా శక్తి సమ్మేళనం” కార్యక్రమాన్ని నిర్వహించింది. అమరావతి రోటరీ క్లబ్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ భారతి మాట్లాడుతూ, జయప్రద ఫౌండేషన్ గ్రామాలను దత్తత తీసుకుని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అమూల్యమైనవని ప్రశంసించారు.2018లో జయప్రద ఫౌండేషన్ వత్సవాయి జిల్లాలోని లింగాల, పోచవరం, గంగవెల్లి గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడి ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతూ, పేద పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, విద్యా సహాయం అందిస్తోందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమరావతి బోన్సాయ్ సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి అమృత కుమార్ మాట్లాడుతూ, ఆడపిల్లలకు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు స్కాలర్‌షిప్‌ల తో పాటు మెన్‌స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లు నిర్వహించి శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేయడం ఆదర్శ దాయకం అని పేర్కొన్నారు.మహిళలకు సాధికారిత కోసం స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తూ, కుట్టు మిషన్ల పంపిణీ, మహిళలకు ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, అవసరమైన వారికి ఉచిత మందులు మరియు శస్త్రచికిత్సలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు గద్దె అనురాధ, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్. విద్యార్థులకు ప‌రిశుభ్ర‌మైన తాగు నీరు అందించాలనే లక్ష్యంతో, కొన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో మినరల్ వాట‌ర్ ప్లాంట్ల‌ను జయప్రద ఫౌండేషన్ ఏర్పాటు చేయటం అభినందననీయం అన్నారు ఉపద్రష్ట అరుణశ్రీ, రాష్ట్ర ఇంచార్జి, సంస్కృత సంస్కృత భారతి బాలకేంద్ర.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్దన్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, అలాగే డాక్టర్ అక్కినేని మణి, అక్కినేని హాస్పిటల్స్; విజయలక్ష్మి, మాజీ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కలశాల; విమల చిగురుపాటి, సుదీక్షణ్ ఫౌండేషన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.జయప్రద ఫౌండేషన్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, మహిళా సాధికారతకు దోహదపడుతున్నాయి.- జయప్రద ఫౌండేషన్#JayapradaFoundation #InternationalWomensDay #WomensDay #IWD2025 #EmpowerWomen #WomenPower #WomenSupportingWomen #GenderEquality #BreakTheBias #EachForEqual #WomenEmpowerment ... See MoreSee Less
View on Facebook